లోకేశ్ విసిరిన సవాల్ కు స్పందించలేదంటే... బాబాయ్ ది గుండెపోటు కాదన్నమాటేగా?: బుద్ధా వెంకన్న

08-04-2021 Thu 12:46
  • వివేకా హత్య అంశంపై బుద్ధా వెంకన్న ట్వీట్
  • రహస్యాన్ని బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్య
  • ఏప్రిల్ 14న వేంకటేశ్వరస్వామిపై ప్రమాణానికి వస్తున్నారా? అని ప్రశ్న
Budda Venkanna comments on Jagan

వైయస్ వివేకానందరెడ్డి హత్య అంశంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. 'వివేకా హత్య వెనుక పులివెందుల రాజన్నకోట రహస్యమేమిటో బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది జగన్ గారూ' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏప్రిల్ 14న తిరుపతి వేంకటేశ్వరస్వామిపై ప్రమాణానికి వస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. నారా లోకేశ్ విసిరిన సవాల్ కు స్పందించలేదంటే... బాబాయ్ ది గుండెపోటు కాదన్నమాటేగా? అని అన్నారు.

మీ బాబాయిని మేము కానీ, మా కుటుంబసభ్యులు కానీ చంపలేదని వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేస్తా... మీరు, మీ కుటుంబసభ్యులు చంపలేదని ప్రమాణం చేస్తారా జగన్ గారూ? అంటూ నారా లోకేశ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.