‘రాధే’పై సల్మాన్​ షాకింగ్​ అప్​ డేట్​!

08-04-2021 Thu 11:59
  • లాక్ డౌన్ కొనసాగితే సినిమా వచ్చే ఏడాదే
  • ఈద్ కు విడుదల చేస్తామన్న కండల వీరుడు
  • కేసులు పెరుగుతుండడంపై ఆందోళన
  • అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచన
The Fate Of Salman Khans Radhe Might Have To Push To Next Eid He Says

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న ‘రాధే’ సినిమాపై ఆయన షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఆ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఆ ఎదురు చూపులు మరికొంత కాలం తప్పేలా లేవు. అవును మరి, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఈద్ కు సినిమాను వాయిదా వేసినట్టు సల్మాన్ చెప్పారు. వెటరన్ నటుడు కబీర్ బేడీతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన సినిమా వాయిదాపై క్లారిటీ ఇచ్చారు.

చెప్పిన టైంకే సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, కానీ, లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే వచ్చే ఈద్ కు సినిమాను వాయిదా వేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలందరు మాస్కులు పెట్టుకుంటూ, భౌతిక దూరం, కరోనా నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే అనుకున్న టైంకే సినిమాను విడుదల చేస్తామన్నారు. సెకండ్ వేవ్ త్వరగానే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కరోనా కేసులు మరింత పెరిగిపోతాయని, దాని వల్ల థియేటర్ యజమానులకే కాకుండా వలస కూలీల ఉపాధికీ ముప్పేనని అన్నారు.