'పుష్ప' టీజర్ పై చిరూ రియాక్షన్

08-04-2021 Thu 11:46
  • ఈ రోజున అల్లు అర్జున్ పుట్టినరోజు
  • నిన్న విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్
  • ఆగస్టు 13వ తేదీన భారీ రిలీజ్  
Megastar Chiranjeevi Reacted on Pushpa Teaser

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది.  ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ .. ముత్తంశెట్టి మీడియావారు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ నేపథ్యంలో బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి నిన్న ఒక టీజర్ ను వదిలారు. బన్నీ పాత్రను హైలైట్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్, యూ ట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది .. లక్షల్లో లైకులను సొంతం చేసుకుంటోంది. సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచేస్తోంది.

ఈ సినిమా టీజర్ ను చూసిన చిరంజీవి తనదైన స్టైల్లో స్పందించారు. "పుష్ప టీజర్ చూశాను .. చాలా రియలిస్టిక్ అండ్ రస్టిక్ గా ఉంది. అలాగే పుష్పరాజ్ గా బన్నీ 'తగ్గేదే లే' .. అంటూ ట్వీట్ చేశారు. బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సినిమాలో బన్నీ జోడీగా .. గిరిజన యువతిగా రష్మిక నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ .. ఫహాద్ ఫాసిల్ పాత్రలు ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ గా కనిపించనున్నాయి. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.