పవన్ హీరోగా హరీశ్ శంకర్ 'సంచారి'

08-04-2021 Thu 11:06
  • 'గబ్బర్ సింగ్'తో లభించిన భారీ హిట్
  • తదుపరి ప్రాజెక్టుకు సన్నాహాలు
  • నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్
Pavan Kalyan Upcoming Project is with Harish Shankar

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వచ్చిన చిత్రాల్లో 'గబ్బర్ సింగ్' స్థానం ప్రత్యేకం. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. అలా పవన్ మనసు గెలుచుకున్న దర్శకుడు హరీశ్ శంకర్, అప్పటి నుంచి ఆయనతో మరో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.

ఈ క్రమంలో, ఇటీవల పవన్ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయనకి హరీశ్ శంకర్ ఒక కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. కథ ప్రకారం ఈ సినిమాకి 'సంచారి' టైటిల్ అయితే బాగుంటుందని హరీశ్ శంకర్ భావిస్తున్నాడట. పవన్ కూడా ఈ టైటిల్ బాగానే ఉందని అన్నాడట.

ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. వాళ్లు కూడా ఈ టైటిల్ పట్ల సంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ టైటిల్ ను పరిశీలనలోనే ఉంచారు. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా రూపొందిన 'వకీల్ సాబ్' రేపు భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ఆయన క్రిష్ .. సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు పూర్తికావలసి ఉంది. ఆ తరువాతనే హరీశ్ శంకర్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.