భారత్‌లో కరోనా సెకండ్ వేవ్.. ఇండియా నుంచి ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం

08-04-2021 Thu 10:57
  • ఈ నెల 11న సాయంత్రం 4 గంటల నుంచి అమల్లోకి నిషేధం
  • ఏప్రిల్ 28 వరకు దేశంలోకి నో ఎంట్రీ
  • న్యూజిలాండ్ పౌరులకూ ఇదే వర్తిస్తుందన్న ప్రభుత్వం
New Zealand Stops Entry Of Travellers From India Amid Covid Surge

భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ తాత్కాలిక నిషేధం విధించింది. భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న సాయంత్రం నాలుగు గంటల నుంచే ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. అంతేకాదు, భారత్ నుంచి వచ్చే స్వదేశీయులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నెల 28వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. న్యూజిలాండ్‌లో తాజాగా వెలుగుచూసిన 23 కేసుల్లో 17 భారత్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో గుర్తించినవే కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.