Russia: గత తొమ్మిదేళ్లలో పాకిస్థాన్‌లో పర్యటించిన తొలి రష్యా మంత్రిగా సెర్గీ లవ్‌రోవ్

  • రెండు రోజుల పర్యటన నిమిత్తం పాక్ చేరుకున్న రష్యా విదేశాంగ మంత్రి
  • ఆఫ్ఘాన్ శాంతి ప్రక్రియలో రష్యా పోషిస్తున్న పాత్రకు పాక్ ప్రశంస
  •  ఉగ్రవాదం అణచివేతకు ఆయుధాలిస్తామన్న రష్యా
Sergei Lavrov to visit Pakistan first by any Russian foreign minister in 9 years

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ భారత పర్యటనను ముగించుకుని పాకిస్థాన్ చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడ పర్యటించనున్న సెర్గీ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ, సైన్యాధిపతి  జనరల్ బజ్వాలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌కు సాయం చేస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఆయుధాలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ఆప్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియలో రష్యా పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు. రష్యా-పాకిస్థాన్ మధ్య గ్యాస్ పైప్‌లైన్‌కు సంబంధించిన అంశంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి ఒకరు పాకిస్థాన్‌లో పర్యటించడం గత 9 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

More Telugu News