రేణిగుంట చేరుకున్న చంద్రబాబు... కాసేపట్లో తిరుమలకు!

08-04-2021 Thu 08:19
  • తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు
  • పనబాక లక్ష్మి తరఫున చంద్రబాబు ప్రచారం
  • శ్రీకాళహస్తి నుంచి మొదలు
Chandrababu Reaches Renigunta Airport

తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫు అభ్యర్థిని పనబాక లక్ష్మి విజయం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఈ ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

తొలుత రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్న ఆయన, సాయంత్రం అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తి పట్టణానికి రానున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. రేణిగుంటకు చేరుకున్న చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.