MAA: 'మా' క్రమశిక్షణ సంఘం బాధ్యతలు ఇక వద్దు... రాజీనామా చేసిన మెగాస్టార్ చిరంజీవి!

  • 2019లో నరేశ్ అధ్యక్షతన కమిటీ
  • ఆపై కొత్త కమిటీలో కృష్ణంరాజు, చిరంజీవి తదితరులు
  • ఎన్నికలకు సమయం దగ్గర పడినందున రాజీనామా
Chiranjeevi Resigns to MAA Post

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) క్రమశిక్షణ సంఘం పదవికి మెగాస్టార్ చిరంజీవి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. తొలుత 2019లో సీనియర్ నరేశ్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. ఆపై కొంత కాలానికి 'మా' కార్యనిర్వాహక సభ్యులు రెండుగా విడిపోగా, కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధలు సభ్యులుగా మరో క్రమశిక్షణా సంఘం ఏర్పాటైంది.

'మా'లో విభేదాలు తొలగకముందే కరోనా వెలుగులోకి రాగా, అప్పటి నుంచి అన్ని రకాల సినిమా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కొవిడ్ ప్రభావం నుంచి బయట పడుతోంది. మరోవైపు 'మా' తదుపరి ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే చిరంజీవి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News