Chitralipi: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రాచీన శాసనాల గుర్తింపు

  • శ్రీశైలంలో చిత్ర లిపి శాసనాలు
  • రుద్రాక్ష మఠానికి ఉత్తర దిక్కులో గుర్తింపు
  • శాసనాలను పరిశీలించిన ఆలయ ఈవో
  • ప్రాచీన కాలం నాటి శాసనాలుగా భావిస్తున్న వైనం
Chitra Lipi scripts found in Srisailam

దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పేరుగాంచింది. తాజాగా శ్రీశైలం క్షేత్రంలో చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. ఇవి చాలా ప్రాచీనమైనవని భావిస్తున్నారు. చిత్ర లిపిలో ఉన్న ఈ శాసనాలు ఆలయ చరిత్రకు అద్దంపట్టే విధంగా ఉన్నాయి.

శ్రీశైలం క్షేత్రంలోని రుద్రాక్ష మఠానికి ఉత్తర దిక్కులోని పరుపుబండపై ఉన్న ఈ శాసనాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ శాసనాలను ఆలయ ఈవో కేఎస్ రామారావు, తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ శాసనాలను మరింత లోతుగా అధ్యయనం చేయిస్తామని ఈవో చెప్పారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామని వెల్లడించారు.

More Telugu News