తగ్గేదే.. లే.... అంటూ 'పుష్ప' వచ్చేశాడు.. వీడియో ఇదిగో!

07-04-2021 Wed 20:52
  • రేపు బన్నీ బర్త్ డే
  • ఒకరోజు ముందే కానుక
  • కొద్ది సేపట్లోనే లక్షల్లో వ్యూస్
  • అల్లు అర్జున్, రష్మిక జంటగా పుష్ప
  • సుకుమార్ దర్శకత్వంలో చిత్రం
Allu Arjun Pushpa teaser video released

రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు కాగా ఒకరోజు ముందే అభిమానులకు కానుక అందింది. పుష్ప సినిమా నుంచి అదిరిపోయే రేంజిలో ఉన్న టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ను 8.19 గంటలకు రిలీజ్ చేయగా కొద్దివ్యవధిలోనే 4 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

"తగ్గేదే.. లే" అంటూ అంటూ చిత్తూరు యాసలో బన్నీ చెప్పే డైలాగు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుందనడంలో సందేహం లేదు. మొత్తానికి పుష్ప చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ సరికొత్త ఫార్మాట్లో తెరకెక్కిస్తున్న వైనం తాజా వీడియోతో వెల్లడైంది. హైదరాబాదులో జరిగిన 'పుష్ప ఫస్ట్ మీట్' కార్యక్రమంలో ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తదితరులు హాజరయ్యారు.

నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.