Andhra Pradesh: పరిషత్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీ... అధికారుల ఉరుకులు పరుగులు!

AP set to go for Parishat elections after high court verdict
  • రేపు ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
  • మార్గం సుగమం చేసిన ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్
  • సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొట్టివేత
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
ఏపీలో పరిషత్ ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే రేపు జరుపుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో అధికారులు, సిబ్బంది ఎన్నికల ఏర్పాట్ల కోసం పరుగులు తీస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల ఏర్పాట్ల కోసం ఏపీ సర్కారు ఇవాళ కూడా సెలవు ప్రకటించింది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుతో ఎన్నికల నిర్వహణ అంశంపై అనిశ్చితి ఏర్పడింది. ఇవాళ డివిజన్ బెంచ్ తీర్పుతో రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మార్గం సుగమం అయింది.

రేపు ఏప్రిల్ 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ బరిలో 19,002 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 126 జడ్పీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పరిషత్ ఎన్నికల కోసం 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,82,15,104 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 38 జడ్పీటీసీ, 601 ఎంపీటీసీ స్థానాలకు, విజయనగరం జిల్లాలో 31 జడ్పీటీసీ, 494 ఎంపీటీసీ స్థానాలకు, విశాఖ జిల్లాలో 38 జడ్పీటీసీ, 614 ఎంపీటీసీ స్థానాలకు, తూర్పు గోదావరి జిల్లాలో 61 జడ్పీటీసీ, 1004 ఎంపీటీసీ స్థానాలకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 46 జడ్పీటీసీ, 790 ఎంపీటీసీ స్థానాలకు, కృష్ణా జిల్లాలో 44 జడ్పీటీసీ, 654 ఎంపీటీసీ స్థానాలకు, గుంటూరు జిల్లాలో 46 జడ్పీటీసీ, 579 ఎంపీటీసీ స్థానాలకు, ప్రకాశం జిల్లాలో 41 జడ్పీటీసీ, 394 ఎంపీటీసీ స్థానాలకు, నెల్లూరు జిల్లాలో 34 జడ్పీటీసీ, 366 ఎంపీటీసీ స్థానాలకు, చిత్తూరు జిల్లాలో 35 జడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు, కడప జిల్లాలో 12 జడ్పీటీసీ, 118 ఎంపీటీసీ స్థానాలకు, కర్నూలు జిల్లాలో 37 జడ్పీటీసీ, 492 ఎంపీటీసీ స్థానాలకు, అనంతపురం జిల్లాలో 63 జడ్పీటీసీ, 791 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Andhra Pradesh
Parishat Elections
AP High Court
MPTC
ZPTC

More Telugu News