radhika: చెక్ బౌన్స్ కేసులో... సినీ న‌టులు రాధిక, శరత్‌కుమార్‌ దంపతులకు ఏడాది జైలు శిక్ష

Court sentences Radhika and Sarathkumar to one year imprisonment
  • 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం అప్పు
  • రేడియంట్‌ గ్రూప్‌  కంపెనీకి తిరిగి చెల్లించ‌ని వైనం
  • వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింద‌ని 2018లో కేసు
చెక్‌ బౌన్స్‌ కేసులో సినీ న‌టి రాధిక‌తో పాటు ఆమె భ‌ర్త శరత్ కుమార్‌కు న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. గత కొన్నేళ్లుగా ఈ దంపతులు  చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ కేసులో వాద‌న‌లు ముగియ‌డంతో కోర్టు తీర్పును వెలువ‌రించింది.

2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం వారిద్ద‌రు రేడియంట్‌ గ్రూప్‌ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని, సకాలంలో తిరిగి చెల్లించ‌లేదు. అనంత‌రం వారు ఇచ్చిన చెక్ బౌన్స్‌ అయింది. వారికి అప్పు ఇచ్చిన రేడియంట్ గ్రూప్‌ 2018లో న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్‌ కోర్టు ఈ రోజు వారికి శిక్ష‌ను ఖ‌రారు చేస్తూ తీర్పు ఇచ్చింది.
radhika
sharath kumar
Tollywood
Tamilnadu

More Telugu News