కామెంట్స్ పై కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్

07-04-2021 Wed 12:40
  • హాస్యనటిగా మంచి గుర్తింపు
  • బరువు తగ్గిన విద్యుల్లేఖ రామన్
  • ఆరోగ్య సమస్యలే కారణమని వెల్లడి

Vidyullekha Raman felt sad for social media comments

విద్యుల్లేఖ రామన్ .. తెలుగు తెరపై గలగలమని మాట్లాడుతూ చక్కని హాస్యాన్ని పండించే కమెడియన్. ఆమె డైలాగ్ డెలివరీ ..  బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటాయి. హాస్యంలో ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. కెమెరా ముందుకు కాకుండా మనముందుగా ఉందేమోననే భావన కలిగేలా ఆమె యాక్టింగ్ ఉంటుంది. 'సరైనోడు' సినిమాలో తమిళ కోడలిగా తెరపై ఆమె చేసిన సందడిని ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. విద్యుల్లేఖ రామన్ తండ్రి మోహన్ రామన్ మంచి నటుడు. బాలచందర్ ఇష్టపడే నటుల్లో ఆయన ఒకరు అంటే అర్థం చేసుకోవచ్చు. తండ్రి నుంచి నటన ఆమెకి వారసత్వంగా వచ్చిందనే అనుకోవాలి.


బొద్దుగా కనిపించే విద్యుల్లేఖ .. ఈ మధ్య కాస్త సన్నబడింది. దాంతో సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయట. ఇకపై కమెడియన్ గా చేయవా? హీరోయిన్ గా మాత్రమే చేస్తావా ఏంటి? అంటూ కామెంట్లు చేశారట. సంపూర్ణేశ్ బాబు సరసన ఒక కథానాయికగా 'పుడింగి నెంబర్.1' సినిమా చేస్తున్న ఆమె, ఈ విషయాన్ని ప్రస్తావించింది. లావు బాగా పెరిగిపోవడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, అందువలన తాను వర్కౌట్లు చేసి సన్నబడితే ఇలా కామెంట్లు చేస్తున్నారంటూ బాధను వ్యక్తం చేసింది. కామెడీతో కూడిన లీడ్ రోల్స్ చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేననే విషయాన్ని స్పష్టం చేసింది.