వరుణ్‌తేజ్‌-సాయిపల్లవికి పెళ్లి చేసేస్తాన‌న్న నెటిజ‌న్.. నాగ‌బాబు స్పంద‌న‌!

07-04-2021 Wed 12:37
  • సినిమా డైలాగును పోస్ట్ చేసిన నాగ‌బాబు
  • తీర్పు కూడా మీరే ఇచ్చుకోండ్రా అంటూ సెటైర్
  • మనమెందుకు ఇక్కడ వెళ్లిపోదాం అని జోక్
nagababu give counter

మెగా హీరో వ‌రుణ్ తేజ్ పెళ్లి గురించి ఆయ‌న తండ్రి నాగ‌బాబుని నెటిజ‌న్లు అప్పుడ‌ప్పుడు ప్ర‌శ్నిస్తుంటారు. తాజాగా, ఓ నెటిజ‌న్ నాగబాబుకు ఓ పోస్ట్ చేస్తూ.. వరుణ్‌తేజ్‌-సాయిపల్లవిల జోడీ బాగుంటుంద‌ని కితాబునిస్తూ.. వారిద్దరికి పెళ్లి చేసేస్తాన‌ని అన్నాడు.  
    
దీనిపై నాగ‌బాబు స్పందిస్తూ చుర‌క‌లంటించారు. 'తీర్పు కూడా మీరే ఇచ్చుకోండ్రా.. అరేయ్‌.. మనమెందుకు ఇంక‌ ఇక్కడ వెళ్లిపోదాం రండి' అని బ్రహ్మానందం 'జాతిర‌త్నాలు' సినిమాలో చెప్పే డైలాగును ఆయ‌న పోస్ట్ చేశారు.

కాగా, కొన్ని నెల‌ల క్రిత‌మే నాగ‌బాబు కూతురు నిహారిక పెళ్లి జ‌రిగిన విష‌యం తెలిసిందే. నెక్ట్స్ వ‌రుణ్ తేజ్ పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌డంతో ఈ విష‌యంపై నాగ‌బాబుకు నెటిజ‌న్లు ఉచిత స‌ల‌హాలు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్  ‘గని’ సినిమాలో న‌టిస్తున్నాడు.