సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

07-04-2021 Wed 07:27
  • రష్మికకు మరచిపోలేని బర్త్ డే!
  • భారీ లెవెల్లో 'ఆచార్య' బిజినెస్
  • 'జాతిరత్నాలు' దర్శకుడి మరో సినిమా      
Unforgettable birth day for Rashmika

*  'ఈ పుట్టినరోజును జీవితంలో మరచిపోలేను' అంటోంది అందాలభామ రష్మిక. ప్రస్తుతం తను ముంబైలో 'గుడ్ బై' సినిమా షూటింగులో వుంది. ఈ సినిమా సెట్స్ లోనే అమితాబ్ బచ్చన్ సమక్షంలో తన బర్త్ డేను జరుపుకుంది. అందుకే, ఈ చిన్నది సంబరపడిపోతూ, ఈ బర్త్ డే చిరస్మరణీయం అంటోంది.
*  మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏమిటనేది మరోసారి ప్రూవ్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'ఆచార్య' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 125 కోట్ల వరకు జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తుండగా..  చరణ్, పూజ హెగ్డే మరో జంటగా నటిస్తున్నారు.
*  ఇటీవల వైజయంతీ మూవీస్ నిర్మించిన 'జాతిరత్నాలు' సినిమా బాక్సాఫీసు వద్ద సుమారు 40 కోట్లను వసూలు చేసి, భారీ హిట్ అనిపించుకుంది. ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన అనుదీప్ మరో సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా వైజయంతీ మూవీస్ నిర్మిస్తుందని తెలుస్తోంది.