Amit Shah: యోగి, షాలను చంపేందుకు 11 మంది ఆత్మాహుతి బాంబర్లు రెడీగా ఉన్నారు: అజ్ఞాతవ్యక్తి ఈ-మెయిల్

Mail threatening to kill Yogi Adityanath and Amit Shah sent to CRPF
  • ముంబై సీఆర్‌పీఎఫ్ కార్యాలయానికి ఈ-మెయిల్
  • ప్రార్థనా మందిరాల వద్ద విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక
  • యోగి, షాలకు భద్రత పెంపు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను చంపేస్తామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి నిన్న వచ్చిన ఈ-మెయిల్ కలకలం రేపింది. దేశంలోని ప్రార్థనా మందిరాల వద్ద కూడా విధ్వంసం సృష్టిస్తామని ఆ లేఖలో పేర్కొన్నాడు.

ముంబై సీఆర్‌పీఎఫ్ కార్యాలయానికి వచ్చిన ఈ లేఖలో... యోగి, షాలను మట్టుబెట్టేందుకు11 మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. లేఖతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిద్దరికీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. కేసు నమోదు చేసుకుని లేఖ ఎక్కడి నుంచి వచ్చిందీ ఆరా తీస్తున్నారు.
Amit Shah
Yogi Adityanath
Warning Email

More Telugu News