సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

06-04-2021 Tue 21:05
  • కరోనా ప్రభావంతో చిత్ర పరిశ్రమకు నష్టం
  • ఇప్పటికే పలు ఉపశమన చర్యలు ప్రకటించిన ఏపీ సీఎం
  • మరోసారి రాయితీలు
  • థియేటర్లు, మల్టిప్లెక్సులకు వర్తించేలా రాయితీలు
  • వేలమంది బాగుపడతారన్న చిరంజీవి
Chiranjeevi thanked CM Jagan

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు రాయితీలు ప్రకటించిన ఏపీ సీఎం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు లబ్ది చేకూర్చేలా ఉపశమన చర్యలు ప్రకటించారని చిరంజీవి తెలిపారు. ఈ రాయితీలు సినీ రంగానికి అత్యావశ్యకమని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఎంతో ఉదారంగా ప్రకటించిన ఈ రాయితీల వల్ల ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలు కోలుకుంటాయని వివరించారు.