BJP: కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉద్ధృతం చేస్తాం: బండి సంజయ్‌

TS BJP Decided to intensify protest against KCR Regime
  • నేడు బీజేపీ పదాధికారుల సమావేశం
  • భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
  • హాజరైన తరుణ్‌ చుగ్‌, కిషన్‌ రెడ్డి
  • సమకాలీన అంశాలపై విస్తృత చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉద్ధృతం చేయాలని తీర్మానించినట్లు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈ మేరకు నేడు రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సమకాలీన అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

భవిష్యత్తులో అనుసరించాల్సిప వ్యూహాలపై పదాధికారులు, మోర్చా అధ్యక్షులు మార్గనిర్దేశం చేశారని బండి సంజయ్‌ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంఛార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
BJP
Telangana
Bandi Sanjay
G. Kishan Reddy
Tarun Chugh

More Telugu News