విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

06-04-2021 Tue 19:01
  • విజయ్ దేవరకొండ, అనన్య జంటగా 'లైగర్'
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం
  • ఆండీ లాంగ్ ఫైట్స్ కంపోజ్ చేస్తాడని చిత్రయూనిట్ వెల్లడి
  • గతంలో జాకీచాన్ చిత్రాలకు పనిచేసిన ఆండీ లాంగ్
Hollywood stunt director Andy Long roped in for Vijay Devarakonda Liger

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'లైగర్' చిత్రం కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ ఫైట్ సీక్వెన్స్ లకు రూపకల్పన చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఆండీ లాంగ్ గతంలో జాకీచాన్ చిత్రాలతో పాటు అనేక హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్ ఘట్టాలకు పనిచేశాడు.

కాగా, పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ ఫైటర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టయినర్ లో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే కథానాయిక. రమ్యకృష్ణ ఇందులో విజయ్ తల్లి పాత్రలో నటిస్తున్నారు. 'లైగర్' చిత్రం సెప్టెంబరు 9న విడుదల కానుంది.