బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ కు కరోనా పాజిటివ్

06-04-2021 Tue 17:33
  • బాలీవుడ్ లో కరోనా కలకలం
  • సెకండ్ వేవ్ లో అధిక కేసులు
  • తనకు కరోనా సోకినట్టు వెల్లడించిన కత్రినా  
  • తనను కలిసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన
  • తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్టు వెల్లడి
Bollywood beauty Katrina Kaif tested corona positive

బాలీవుడ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా తొలినాళ్లలో కంటే సెకండ్ వేవ్ లో దాని బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా అందాలభామ కత్రినా కైఫ్ కు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. తనకు కరోనా సోకిన విషయాన్ని తనే  స్వయంగా వెల్లడించింది.

మెడికల్ టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చిన వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లానని తెలిపింది. వైద్యుల సలహాల మేరకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించింది. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కత్రినా సూచించింది. తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు పొంగిపోతున్నానని, ప్రతిఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని అమ్మడు ఓ ప్రకటన చేసింది.

బాలీవుడ్ లో గత కొన్నిరోజుల వ్యవధిలోనే అక్షయ్ కుమార్, అలియా భట్, వికీ కౌశల్, భూమి పెడ్నేకర్ తదితరులు కరోనా బాధితుల జాబితాలో చేరారు.