ఊగిసలాటల మధ్య.. స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

06-04-2021 Tue 16:40
  • మార్కెట్లపై ప్రభావం చూపిన కరోనా
  • ఆద్యంతం ఒడిదుడుకులకు గురైన సూచీలు
  • చివరకు 42 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు... ఆ తర్వాత లాభాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతర తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతూ... చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో 49,201కి చేరింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 14,683 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (4.07%), సన్ ఫార్మా (1.88%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.44%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.35%), నెస్లే ఇండియా (1.05%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.29%), యాక్సిస్ బ్యాంక్ (-1.12%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.09%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.88%).