Talasani: రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు జానారెడ్డి గెలిచినా ఉపయోగం ఉండదు: తలసాని

Talasani comments on Congress candidate Janareddy
  • నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
  • టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్
  • భగత్ తరఫున ప్రచారం చేసిన తలసాని, బాల్క సుమన్
  • అధికారంలో ఉన్నప్పుడే జానా ఏం చేయలేదన్న తలసాని 
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల భగత్ తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రచారంలో పాల్గొన్నారు. పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామంలో జరిగిన ప్రచార సభలో తలసాని మాట్లాడుతూ.... కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఓటేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, గతంలో అధికారంలో ఉన్నప్పుడే జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఇప్పుడు జానారెడ్డి గెలిచినా ఏంచేస్తారని విమర్శించారు. విద్యావంతుడైన నోముల భగత్ కు ఓటేయాలని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే భగత్ ను ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తీరాలంటే టీఆర్ఎస్ నే గెలిపించాలని తలసాని పిలుపునిచ్చారు.
Talasani
Jana Reddy
Nagarjuna Sagar Bypolls
Nomula Bhagat
TRS
Congress
Telangana

More Telugu News