మావోయిస్టు హిడ్మా ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్​

06-04-2021 Tue 14:13
  • ‘ప్రహార్ 3’ చేపట్టాలని నిర్ణయం
  • మరో 8 మంది నక్సలైట్లు టార్గెట్
  • మోస్ట్ వాంటెడ్ జాబితా సిద్ధం
Central Govt decides to handle Operation Prahar 3 targets Hidma

24 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న మావోయిస్టు హిడ్మా ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల దాడికి దీటుగా బదులివ్వాలని నిర్ణయించింది. భద్రతా బలగాలను ట్రాప్ చేసి హతమార్చిన మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లక్ష్యంగా ‘ఆపరేషన్ ప్రహార్ 3’ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మరో 8 మంది మావోయిస్టులనూ హిట్ లిస్ట్ లో పెట్టింది. వారికి సంబంధించి వాంటెడ్ జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది.

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్–సుక్మా సరిహద్దుల్లో మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో 24 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. పథకం ప్రకారం ‘యూ’ ఆకారంలో చుట్టుముట్టిన నక్సలైట్లు.. జవాన్లను కాల్చి చంపారు. ఎటు పోవడానికి లేకుండా చేసి దాడికి పాల్పడ్డారు.