వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ వస్తే చాలు జగన్ గజగజా వణుకుతున్నాడు: నారా లోకేశ్

06-04-2021 Tue 13:31
  • ఇటీవల వివేకా హత్యకేసుపై కుమార్తె ప్రెస్ మీట్
  • సర్కారు సహకరించడంలేదని వ్యాఖ్యలు
  • డాక్టర్ సునీతారెడ్డి కామెంట్స్ ను పంచుకున్న లోకేశ్
  • హూ కిల్డ్ బాబాయ్? అంటూ ట్వీట్
Nara Lokesh criticises CM Jagan on Viveka murder

తన తండ్రి హత్య కేసులో విచారణకు ఏపీ ప్రభుత్వం సహకరించడంలేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆరోపించడం తెలిసిందే. తాజాగా డాక్టర్ సునీతారెడ్డి కామెంట్స్ వీడియోను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందరూ అడిగినట్టే తాను కూడా అడుగుతున్నానని, హూ కిల్డ్ బాబాయ్? అంటూ ట్వీట్ చేశారు.

"మీ చిన్నాన్నను మా నాన్న నరికేశాడన్నావు. దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నావు. ఇప్పుడెందుకు సీబీఐని వద్దంటున్నావు... చెప్పు అబ్బాయి!" అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐ వస్తే చాలు... ఢిల్లీని గడగడలాడిస్తానన్న జగన్ గజగజా వణుకుతున్నాడు అని ఎద్దేవా చేశారు.