తిరుపతిలో ఎల్లుండి నుంచి చంద్రబాబు ప్రచారం

06-04-2021 Tue 08:24
  • రేపు రాత్రికి తిరుపతి చేరుకోనున్న చంద్రబాబు
  • ఎల్లుండి శ్రీవారిని దర్శించుకుని ప్రచారానికి శ్రీకారం 
  • వారం రోజులపాటు ప్రచారం
Chandrababu Naidu Campaign in tirupat from April 8th

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 8 నుంచి తిరుపతిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక్కడి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. ఆమెకు మద్దతుగా చంద్రబాబు వారం రోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో రేపు రాత్రికి చంద్రబాబు తిరుపతి చేరుకుంటారు. 8న ఉదయం శ్రీవారిని దర్శించుకుని పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. రోజుకు ఒక శాసనసభ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో రెండు మూడు ప్రచార సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. కాగా, ఇక్కడ ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేశ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.