బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌‌లో 11 మంది పోలీసులకు కరోనా

06-04-2021 Tue 07:33
  • తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
  • సీఐ, ఎస్సై సహా 11 మందికి సోకిన వైరస్
  • గతంలో ఇదే పోలీస్ స్టేషన్‌లో 50 మందికి కరోనా
11 police personal infected to corona virus in Banjara Hills police station

తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ విరుచుకుపడుతోంది. రోజురోజుకు వైరస్ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సీఐ, ఎస్సై సహా 9 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. ఇదే పోలీస్ స్టేషన్‌లో గతంలో 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా బారినపడి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పోలీస్ స్టేషన్‌లో  9 మంది కానిస్టేబుళ్లు, సీఐ, ఓ మహిళా ఎస్సై కరోనా బారినపడడం ఆందోళన రేకెత్తిస్తోంది.