మేనల్లుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు.... మోషన్ పోస్టర్ సూపర్ కూల్ గా ఉందని కితాబు

05-04-2021 Mon 22:07
  • వెండితెరకు పరిచయం అవుతున్న అశోక్ గల్లా
  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చిత్రం
  • ఉగాదికి టైటిల్ ప్రకటన
  • నేడు అశోక్ గల్లా పుట్టినరోజు
  • మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం
Mahesh Babu comments on Ashok Galla movie motion poster

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. సొంత బ్యానర్ అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై అశోక్ గల్లా హీరోగా ఓ యూత్ ఫుల్ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమా టైటిల్ ను ఉగాదికి ప్రకటించనున్నారు.

ఇవాళ అశోక్ గల్లా పుట్టినరోజు కావడంతో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిపై మహేశ్ బాబు స్పందించారు. హ్యాపీ బర్త్ డే అశోక్ గల్లా అంటూ శుభాకాంక్షలు తెలిపారు. మోషన్ పోస్టర్ సూపర్ కూల్ గా ఉందని వ్యాఖ్యానించారు. "వెండితెరపై నీ ఎంట్రీ చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఏడాది ఊపేస్తావని ఆశిస్తున్నా" అంటూ మేనల్లుడ్ని దీవించారు. కాగా ఈ చిత్రంలో అశోక్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.