షర్మిల ఖమ్మం సభ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు!

05-04-2021 Mon 19:36
  • ఖమ్మంలో ఏప్రిల్ 9న షర్మిల బహిరంగ సభ
  • ఇప్పటికే అనుమతి ఇచ్చిన పోలీసులు
  • తెలంగాణలో కరోనా తీవ్రం
  • ఈ నేపథ్యంలో జీవో 68, 69 ప్రకారం నోటీసులు
  • నిబంధనలు పాటిస్తూ సభ జరుపుతామన్న నిర్వాహకులు
Police issues notices to Khammam rally organizers

తెలంగాణలో పార్టీ స్థాపించాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిల ఈ నెల 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనుండడం తెలిసిందే. అయితే ఇప్పుడా సభ నిర్వహణపై అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయి. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో సభకు షర్మిల బృందం ఇటీవల పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. ఇంతలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో పోలీసు శాఖ పునరాలోచనలో పడింది.

ఈ క్రమంలోనే పోలీసులు షర్మిల బృందానికి నోటీసులు జారీ చేశారు. జీవో 68, 69 ప్రకారం ఖమ్మం జిల్లా ఇన్చార్జి లక్కినేని సుధీర్ కు నోటీసులు పంపారు. అయితే, కరోనా మార్గదర్శకాలు, అన్ని నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహిస్తామని షర్మిల బృందం పోలీసులకు బదులిచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఖమ్మం సభ ద్వారానే తన పార్టీ పేరు, గుర్తు ప్రకటించాలని షర్మిల భావిస్తున్నారు.