'ఆచార్య' విడుదల వాయిదా పడనుందా?

05-04-2021 Mon 19:07
  • కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య'
  • మే 14న రిలీజ్ చేసే ఆలోచన
  • దసరాకు వెళ్లొచ్చుననే ప్రచారం  
Acharya is postponed to Dussera

చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ అలరించనుంది. ఇక ఈ సినిమాలో చరణ్ ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉండగా, ఆయన జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఇప్పటికే శాంపిల్ గా వదిలిన 'లాహే లాహే' సాంగ్ తో మణిశర్మ సంగీతానికి మంచి మార్కులు పడిపోయాయి. భారీ బడ్జెట్ తో కొరటాల మార్కుతో రూపొందుతున్న ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలని భావించారు.


అయితే మే 14వ తేదీకి ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమే కావొచ్చనే ఒక టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఒక వైపున కరోనా తన ప్రతాపం చూపుతోంది .. ఇప్పటికే జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. మే నెల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలియదు. ఇక తెలంగాణలో ఒక సమయంలో .. ఆంధ్రలో మరో సమయంలో పిల్లలకు పరీక్షలు ఉన్నాయి. అందువలన దర్శక నిర్మాతలు విడుదల తేదీని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఒకవేళ వాయిదా అంటూ పడితే, ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని చెప్పుకుంటున్నారు.