లవర్ కోసం అమ్మాయిల హాస్టల్ కు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ప్రకాశం జిల్లా యువకుడు

05-04-2021 Mon 18:47
  • గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘటన
  • తాడేపల్లిలో ఓ వర్సిటీలో బీబీఏ చదువుతున్న వినయ్
  • అదే వర్సిటీకి చెందిన అమ్మాయితో ప్రేమ వ్యవహారం
  • ఆదివారం నాడు బయటికెళ్లిన ప్రేమికులు
  • రాత్రి అమ్మాయిని హాస్టల్ గోడ దాటిస్తుండగా ఘటన
  • భవనం పైనుంచి పడి మరణించిన వినయ్
Youth ended life in a tragic incident in Tadepally

ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు తన గాళ్ ఫ్రెండ్ కోసం అమ్మాయిల హాస్టల్ కు వెళ్లి అనూహ్యరీతిలో మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన వినయ్ తాడేపల్లిలోని ఓ ప్రైవేటు వర్సిటీలో బీబీఏ చదువుతున్నాడు. ఆ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థినితో వినయ్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు.

నిన్న ఆదివారం సెలవు కావడంతో ఇద్దరూ బయటికి వెళ్లి ఎంజాయ్ చేశారు. రాత్రి వేళ ప్రియురాలిని అమ్మాయిల హాస్టల్ గోడ దాటిస్తుండగా వాచ్ మన్ కంటబడ్డాడు. వాచ్ మన్ కేకలు వేయడంతో భవంతి పైన పరుగులు తీసిన వినయ్ పట్టుతప్పి కిందపడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై వినయ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.