సెన్సార్ పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్'

05-04-2021 Mon 18:02
  • పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో 'వకీల్ సాబ్'
  • 'వకీల్ సాబ్' చిత్రానికి U/A సర్టిఫికెట్
  • ఏప్రిల్ 9న గ్రాండ్ రిలీజ్
  • నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'వకీల్ సాబ్'
  • వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చిత్రం
Pawan Kalyans Vakeel Saab movie gets censor certificate

పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం 'వకీల్ సాబ్'. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. 'వకీల్ సాబ్' చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవడంతో ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే మిగిలుంది. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో వచ్చిన 'పింక్' చిత్రానికి తెలుగు నేటివిటీకి, పవన్ ఇమేజ్ కు తగిన విధంగా మార్పులు చేసి 'వకీల్ సాబ్' గా రీమేక్ చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతి హాసన్ కథానాయిక కాగా... కీలకపాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ నటించారు. తమన్ సంగీతం అందించిన 'వకీల్ సాబ్' పాటలకు విశేషమైన ప్రజాదరణ లభిస్తోంది. నిన్ననే హైదరాబాదు శిల్పకళావేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకుంది.