Jagan: చత్తీస్ గఢ్ లో మృతి చెందిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ప్రకటించిన ఏపీ సీఎం జగన్

CM Jagan announces financial help to AP Jawans families who laid down in Chhattisgarh attack
  • చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
  • సుక్మా-బీజాపూర్ అటవీప్రాంతంలో నక్సల్స్ మెరుపుదాడి
  • 22 మంది భద్రతా సిబ్బంది బలి
  • వారిలో ఇద్దరు తెలుగువారు
  • ఏపీకి చెందిన రౌతు జగదీశ్, శాఖమూరి మురళీకృష్ణ మృతి
ఏపీ సీఎం జగన్ మరోసారి మానవీయతతో స్పందించారు. చత్తీస్ గఢ్ లో నక్సల్స్ దాడిలో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్ గఢ్ లోని సుక్మా-బీజాపూర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏపీకి చెందిన రౌతు జగదీశ్, శాఖమూరి మురళీకృష్ణ అనే సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు అమరులయ్యారు. వారి మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Jagan
CRPF Jawans
Financial Help
Chhattisgarh
Andhra Pradesh

More Telugu News