ఆ డబ్బులతోనే టీఆర్ఎస్‌ రాజకీయాలు చేస్తోంది: బండి సంజ‌య్‌

05-04-2021 Mon 13:53
  • టీఆర్ఎస్ రాజకీయంతో డబ్బులు సంపాదించుకుంది
  • ఇప్పటికైనా కేసీఆర్ త‌న‌ తీరును  మార్చుకోవాలి
  • కేసీఆర్ త‌న‌ ఫామ్ హౌస్‌లో సేద తీరుతున్నారు
bandi sanjay slams trs government

టీఆర్ఎస్ పార్టీ రాజకీయంతో డబ్బులు సంపాదించుకుంద‌ని, ఆ డబ్బులతోనే  తెలంగాణ‌లో రాజకీయాలు చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరును  మార్చుకోవాలని ఆయ‌న చెప్పారు.  

బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా హైద‌రాబాద్‌లో ఆయ‌న విగ్ర‌హానికి నివాళులర్పించిన బండి సంజ‌య్ అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇన్నేళ్లుగా సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా జయంతి ఉత్సవాలకు రాలేదని, త‌న‌ ఫామ్ హౌస్‌లో ఆయన సేద తీరుతున్నారని విమర్శించారు.

125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసీఆర్ హామీ ఏమైంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ విష‌యంలో ఆయా దళిత సామాజిక సంఘాలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని బండి సంజ‌య్ అడిగారు.