తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం!

05-04-2021 Mon 06:27
  • దక్షిణ ఛత్తీస్ గఢ్ పై ఉపరితల ఆవర్తనం
  • పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం
  • హెచ్చరించిన వాతావరణ శాఖ
Rain Alert for Telangana

దక్షిణ ఛత్తీస్ గడ్, దాని పరిసరాల్లో సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నందున తెలంగాణలో నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ లతో పాటు సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలియజేశారు.