హైదరాబాదులో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ షురూ

04-04-2021 Sun 19:59
  • పవన్ హీరోగా వకీల్ సాబ్
  • పింక్ చిత్రానికి రీమేక్
  • వేణు శ్రీరామ్ దర్శకత్వం
  • శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్
Vakeel Saab pre release event in Hyderabad

పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో నటించిన వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు శిల్పకళావేదికలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాత దిల్ రాజు, ఈ చిత్రంలో నటించిన అంజలి, అనన్య నాగళ్ల తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారిణి సుమతి స్త్రీ సాధికారతపై స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి క్రిష్ జాగర్లమూడి, ఏఎం రత్నం, బండ్ల గణేశ్ తదితరులు కూడా విచ్చేశారు. బాలీవుడ్ లో విశేష ప్రజాదరణ పొందిన పింక్ చిత్రానికి రీమేక్ గా తెలుగులో వకీల్ సాబ్ చిత్రం తెరకెక్కించారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించింది.