బాలీవుడ్‌ హీరో గోవిందకు కరోనా పాజిటివ్

04-04-2021 Sun 19:20
  • ఆదివారం ఉదయం నిర్ధారణ
  • స్వల్ప లక్షణాలతో హోంక్వారంటైన్‌
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సతీమణి
  • అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వెల్లడి
Bollywood star Govinda Contracted with Corona

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవింద(57) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆదివారం ఉదయం ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సతీమణి సునీత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.

గోవిందకు కరోనా సోకిందన్న వార్త బయటకు రావడానికి ముందే మరో బాలీవుడ్‌ ప్రముఖ స్టార్‌ అక్షర్‌ కుమార్‌ సైతం మహమ్మారి బారిన పడ్డట్లు తెలిసింది. ఇటీవల ఆలియా భట్‌, ఫాతిమా సనా షేక్‌, కార్తిక్ ఆర్యన్, పరేశ్‌ రావల్‌, మిలింద్ సోమన్‌ వంటి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మరోవైపు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌, మలైకా అరోరా వంటి స్టార్లు ఇప్పటికే కరోనా టీకా తీసుకున్నారు.