అనాథ పిల్లలతో ఈస్టర్ విందు ఆరగిస్తూ ప్రియాంకకు వీడియో కాల్ చేసిన రాహుల్ గాంధీ

04-04-2021 Sun 15:42
  • కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం
  • నేడు వయనాడ్ జిల్లాలో పర్యటన
  • ఓ అనాథాశ్రమం సందర్శన
  • తిరుణెల్లి ఆలయంలోనూ పూజలు
  • స్థానిక సెబాస్టియన్ చర్చిలో ప్రార్థనలు
Rahul Gandhi video call to his sister Priynaka during his visit an orphanage

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నేడు వయనాడ్ జిల్లాలో ఓ అనాథాశ్రమంలో రాహుల్ భోజనం చేశారు. ఇవాళ ఈస్టర్ పండుగ సందర్భంగా అక్కడి అనాథ బాలలతో కలిసి రాహుల్ గాంధీ విందు ఆరంగించారు. ఓవైపు భోజనం చేస్తూనే తన సోదరి ప్రియాంక గాంధీకి వీడియో కాల్ చేశారు. అనాథ పిల్లలు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకతో వీడియో కాల్ లో మాట్లాడి మురిసిపోయారు.

కాగా రాహుల్ ఈ ఉదయం వయనాడ్ లోని తిరుణెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆచార సంప్రదాయాల ప్రకారం ఆలయ ప్రవేశం చేసి భక్తితో పూజలు చేశారు. అటు ఈస్టర్ సందర్భంగా స్థానిక సెబాస్టియన్ చర్చిలో ప్రార్థనలు కూడా ఆచరించారు.