కరోనా వ్యాక్సిన్ రెండో డోసు​ తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

04-04-2021 Sun 14:15
  • టీకా వేసిన ఎయిమ్స్ వైద్యులు
  • అర్హత ఉన్న వారంతా వేయించుకోవాలని సూచన
  • జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపు
Vekaiah Naidu Administered Second Dose of Covid Vaccine

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోన వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్ లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ‘‘ఎయిమ్స్ లో ఆదివారం ఉదయం కరోనా టీకా రెండో డోసు తీసుకున్నాను. అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. అర్హత ఉన్నవారంతా వెంటనే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి. కరోనా కేసులు పెరుగుతున్నందున అందరూ జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నిబంధనలను పాటించండి’’ అని వెంకయ్య సూచించారు. కాగా, అంతకుముందు ఫస్ట్ డోస్ ను ఆయన చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేయించుకున్నారు.