బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ కు కరోనా

04-04-2021 Sun 12:59
  • ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని వెల్లడి
  • తనను కలిసినవారు టెస్ట్ చేయించుకోవాలని సూచన
  • రామసేతు షూటింగ్ లో బిజీబిజీగా అక్షయ్
Akshay Kumar tests positive for COVID 19

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా సోకింది. ఆదివారం ఉదయం ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘ఆదివారం ఉదయం కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కరోనా నిబంధనలను పాటిస్తూ నేను వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లాను. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నా. ఇంట్లోనే వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నా. కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ లో ఉన్న వారు వెంటనే టెస్ట్ చేయించుకోండి. జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తా’’ అని అక్షయ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఆయన ‘రామ సేతు’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. సినిమాలో ఆయన పురాతత్వ శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. నుష్రత్ భరూచా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు అక్షయ్ కు జోడీ కడుతున్నారు. దాంతో పాటు ఖిలాడీ కుమార్, సూర్యవంశీ, ఆత్రంగే రే సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆత్రంగే రేలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ మరో హీరోగా నటిస్తున్నారు.