చాడ వెంక‌ట్ రెడ్డి ప్ర‌యాణిస్తోన్న వాహ‌నాన్ని ఢీ కొట్టిన మ‌రో వాహ‌నం.. చాడ‌కు త‌ప్పిన ప్ర‌మాదం

04-04-2021 Sun 12:35
  • హ‌న్మ‌కొండ‌లో ఘ‌ట‌న‌
  • వాహ‌నాల్లో ఉన్న‌ ఇద్ద‌రికి స్వ‌ల్ప‌ గాయాలు
  • ప్ర‌మాదంపై పోలీసుల‌ ద‌ర్యాప్తు ప్రారంభం
chada venkat reddy escapes from an accident

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హన్మకొండ మీదుగా ప్ర‌యాణిస్తోన్న స‌మ‌యంలో ఆయ‌న వాహ‌నాన్ని మ‌రో వాహ‌నం ఢీ కొట్టింది. దీంతో ఆయా వాహ‌నాల్లో ఉన్న‌ ఇద్ద‌రికి స్వ‌ల్ప‌ గాయాల‌య్యాయి.

చాడ వెంక‌ట్ రెడ్డి సుర‌క్షితంగా ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిశీలిస్తున్నారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. దీనిపై పూర్తి స‌మాచారం రావాల్సి ఉంది.