అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు కరోనా పాజిటివ్!

04-04-2021 Sun 09:55
  • సెల్ఫ్ ఐసొలేషన్ లో ప్రముఖులు
  • ఇంకా వెలువడని అధికారిక సమాచారం
  • ఇటీవలే నటి నివేదా థామస్ కు కరోనా
Allu Aravind and Trivikram Gets Corona Positive

కరోనా బారిన పడుతున్న తెలుగు సినీ ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తో పాటు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లు మహమ్మారి బారిన పడ్డారని, వీరిద్దరూ ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటూ చికిత్సను పొందుతున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెలువడలేదు.

అటు అల్లు అరవింద్ కార్యాలయం నుంచి గానీ, ఇటు త్రివిక్రమ్ నుంచి గానీ, కరోనా సోకడంపై క్లారిటీ రావాల్సి వుంది. ఇటీవలే వకీల్ సాబ్ నటి నివేదా థామస్ కు కరోనా సోకగా, ఆమె ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.