Corona Virus: తెలంగాణలో భారీగా పెరిగిపోతోన్న క‌రోనా కేసులు

  Media Bulletin on status of positive cases COVID19 in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్త‌గా 1,321 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 293  మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  3,12,140కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,500 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,717గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 7,923 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,866 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 320 మందికి క‌రోనా సోకింది.

 
     
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News