Summer: రానున్న మూడు రోజులు బయటకే వెళ్లవద్దంటున్న వాతావరణ శాఖ!

  • 43 డిగ్రీల వేడిమికి అవకాశం
  • 7వ తేదీ వరకూ ఇదే పరిస్థితి
  • విదర్భ నుంచి వీయనున్న వడగాలులు
Dontgooutside next 3 days warns IMF

రానున్న మూడురోజులూ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రత 40 నుంచి 43 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకే వెళ్లవద్దని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ఎండ అధికంగా ఉంటుందని, ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య తీవ్రత అధికమని, విదర్భ నుంచి వడగాలులు వీయనున్నాయని అధికారులు హెచ్చరించారు.

ఆదిలాాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల మీదుగా ఇవి వెళ్లనున్నాయని, ఈ కారణంతో చిన్న పిల్లలను బయటకు పంపించవద్దని అధికారులు సలహా ఇస్తున్నారు. వీరితో పాటు దీర్ఘకాలిక రోగాలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇదిలావుండగా, శనివారం నాడు అత్యధికంగా భద్రాచలంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, విజయవాడ తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఎండ వేడిమి నమోదైంది.

More Telugu News