కనిమొళికి కరోనా పాజిటివ్... ప్రచార కార్యక్రమాలు రద్దు

03-04-2021 Sat 22:13
  • తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • ఈ నెల 6న పోలింగ్
  • డీఎంకే తరఫున కనిమొళి ప్రచారం
  • కరోనా సోకడంతో స్వీయ నిర్బంధం
  • ప్రచార కార్యక్రమాలు రద్దు
DMK MP Kanimozhi tested corona positive

డీఎంకే మహిళా ఎంపీ, కరుణానిధి కుమార్తె కనిమొళికి కరోనా సోకింది. ప్రస్తుతం తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట ప్రచార పర్వం తీవ్రస్థాయిలో సాగుతోంది. డీఎంకే తరఫున కనిమొళి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఇప్పుడామెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పార్టీ వర్గాలు కించిత్ నిరాశకు గురయ్యాయి. కరోనా బారినపడడంతో కనిమొళి ప్రచార కార్యక్రమాలను పార్టీ రద్దు చేసింది. ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.