చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో జవాన్ల మృతిపై ప్రధాని స్పందన

03-04-2021 Sat 21:43
  • చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
  • ఐదుగురు జవాన్ల వీరమరణం
  • జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ
  • వారి త్యాగాలు మరువలేమని వ్యాఖ్యలు
  • క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
PM Modi responds on Chhattisgarh encounter

చత్తీస్ గఢ్ లోని సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలకు చెందిన ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతూ అసువులుబాసిన మృతవీరుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. ధైర్యవంతులైన ఆ జవాన్ల ప్రాణత్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివని పేర్కొన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.