డైనమిక్ ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ!

  • నిరాశ పరిచిన 'చావుకబురు చల్లగా'
  • పట్టాలెక్కిన కొత్త ప్రాజెక్టు
  • కథానాయికగా తాన్య రవిచంద్రన్ పరిచయం 
Karthikeya will be seen as a NIA officer

ఇటీవల 'చావుకబురు చల్లగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో కార్తికేయ నటించే మరో సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో తాజాగా వచ్చేసింది. అయితే ఇది ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రాజెక్టు కాదు లెండీ. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన షూటింగును మొదలుపెడుతూ ఈ కాన్సెప్ట్ వీడియోను వదిలారు.

 'శ్రీ సరిపల్లి' ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయం అవుతున్నాడు. ఆయన కార్తికేయను ఎన్ఐఏ ఆఫీసర్ గా చూపించనున్నాడు. అందుకు తగినట్టుగానే కార్తికేయ ఈ వీడియోలో, గన్ తో బుల్లెట్ల వర్షం కురిపిస్తూ చెలరేగిపోయాడు.

శ్రీచిత్ర మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగుతుంది. తొలిసారిగా కార్తికేయ చేస్తున్న పూర్తి యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమాలో ఆయన సరసన తాన్య రవిచంద్రన్ కథానాయికగా అలరించనుంది.

ఇక కీలకమైన పాత్రలో సాయికుమార్ కనిపించనున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు. అందుకు ముహూర్తం త్వరలోనే ఉందనే హింట్ మాత్రం ఇచ్చారు. ఈ ఏడాది 'చావుకబురు చల్లగా' సినిమాతో ఫ్లాప్ అందుకున్న కార్తికేయ, ఈ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.

More Telugu News