రేణిగుంట చేరుకున్న పవన్ కల్యాణ్... ఘనస్వాగతం పలికిన జనసైనికులు

03-04-2021 Sat 18:05
  • తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక
  • బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున పవన్ ప్రచారం
  • ఎమ్మార్ పల్లి నుంచి శంకరంబాడి వరకు పాదయాత్ర
  • శంకరంబాడి కూడలిలో పవన్ ప్రసంగం
Rousing welcome for Pawan Kalyan at Renigunta airport

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేణిగుంట చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ఆయనకు జనసేన పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. తిరుపతి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేసేందుకు పవన్ విచ్చేశారు. పవన్ రాక నేపథ్యంలో ఈ మధ్యాహ్నమే పార్టీ శ్రేణులు విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నాయి. కాగా, రత్నప్రభ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మార్ పల్లి నుంచి శంకరంబాడి వరకు పవన్ పాదయాత్ర చేయనున్నారు. ఆ తర్వాత శంకరంబాడి కూడలి వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.