'రిపబ్లిక్' నుంచి రమ్యకృష్ణ పవర్ఫుల్ లుక్!

03-04-2021 Sat 17:40
  • దేవ కట్టా దర్శకుడిగా 'రిపబ్లిక్'
  • పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ
  • జూన్ 4వ తేదీన రిలీజ్      

Republc First Look Poster Released

సాయితేజ్ యువ కథానాయకులకు గట్టిపోటీ ఇచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన చేస్తున్న సినిమానే 'రిపబ్లిక్'. టైటిల్ ను బట్టే ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అనే విషయం అర్థమవుతూనే ఉంది. ఉద్వేగభరితమైన .. ఉద్యమభరితమైన కథలను మలచడంలో దేవ కట్టా సిద్ధహస్తుడు. ఆయనే ఈ సినిమాకి దర్శకుడు. ఈ తరహా కథలకు సాయితేజ్ కూడా బాగానే సెట్ అవుతాడు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

సాయితేజ్ సరసన నాయికగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. రమ్యకృష్ణ ఇద్దరూ కూడా చాలా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ముఖ్యంగా రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనే టాక్ మెదటి నుంచి వినిపిస్తోంది. అందుకు తగినట్టుగానే కొంతసేపటి క్రితం విడుదల చేసిన ఆమె ఫస్టు లుక్ పోస్టర్ కూడా కనిపిస్తోంది. 'తప్పూ ఒప్పులు లేవు .. అధికారం మాత్రమే శాశ్వతం' అనే లైన్ రమ్యకృష్ణ పాత్ర స్వభావానికి అద్దం పడుతోంది. పెయింటింగ్ పిక్చర్ స్టైల్లో వదిలిన రమ్యకృష్ణ లుక్ .. దర్పంతో కనిపిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూన్ 4వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.