నోటాకి వచ్చినన్ని ఓట్లు కూడా బీజేపీకి రాలేదు కానీ ప్రగల్భాలు పలుకుతున్నారు: టీడీపీ నేత జవహర్

03-04-2021 Sat 17:28
  • పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ
  • టీడీపీ పారిపోయిందన్న సోము వీర్రాజు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జవహర్
  • సోము వీర్రాజు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక
  • చేతనైతే వైసీపీపై పోరాటం చేయాలని హితవు
Former minister Jawahar fires on BJP leader Somu Veerraju

టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. నూతన ఎస్ఈసీ ప్రభుత్వానికి రబ్బర్ స్టాంపులా పనిచేస్తున్నారు కాబట్టే పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేత సోము వీర్రాజు టీడీపీ పారిపోయిందంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.  నోటాకి వచ్చినన్ని ఓట్లు కూడా బీజేపీకి రాలేదు కానీ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. సోము వీర్రాజు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. సోము వీర్రాజు టీడీపీపై కాకుండా వైసీపీపై పోరాటం చేయాలని జవహర్ సలహా ఇచ్చారు.