Pawan Kalyan: పవన్ 'వకీల్ సాబ్' సినిమా నిడివి ఎంతంటే..!

Vakeel Sab film runtime locked
  • ఈ నెల 9న వస్తున్న పవన్ వకీల్ సాబ్ 
  • కొత్త సీన్స్ కలపడంతో పెరిగిన నిడివి 
  • సినిమా రన్ టైమ్ 154 నిమిషాలు
పవన్ కల్యాణ్ అభిమానులు ఆవురావురుమంటూ వున్నారు. గత కొన్నాళ్లుగా తమ అభిమాన కథానాయకుడి కొత్త సినిమా ఏదీ లేకపోవడంతో వాళ్లు ఆకలిగా వున్నారు.  ఈ క్రమంలో పవన్ నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్' కోసం వేయికళ్లతో   ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తుండడంతో.. ఎప్పుడు ఆ రోజు వస్తుందా.. ఎప్పుడు థియేటర్లలో హంగామా  చేద్దామా? అన్న కుతూహలంతో.. జోష్ తో వున్నారు.

హిందీలో హిట్టయిన 'పింక్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ కలసి నిర్మించిన సంగతి విదితమే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించగా.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే సెన్సార్ పూర్తయిన ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ (నిడివి) కూడా కాస్త ఎక్కువే ఉందని అంటున్నారు. ఒరిజినల్ వెర్షన్లో లేని కొన్ని సన్నివేశాలను తెలుగు వెర్షన్ కి కలపడంతో నిడివి పెరిగిందని అంటున్నారు. దీంతో 154 నిమిషాల రన్ టైమ్ వచ్చిందట.

ఇక, పవన్ సినిమా అంటే మామూలుగానే రిలీజ్ రోజున థియేటర్ల వద్ద భారీ సందడి ఉంటుంది. అందులోనూ ఇప్పుడు భారీ గ్యాప్ తర్వాత పవన్ సినిమా వస్తుండడంతో  ఏప్రిల్ 9న థియేటర్ల వద్ద ఇక అభిమానుల హడావిడి ఎలా వుంటుందో చెప్పేక్కర్లేదు. మరి, న్యాయవాది పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్ కల్యాణ్ ఏమేరకు అలరిస్తారో.. ఎన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి!
Pawan Kalyan
Shruti Haasan
Anjali
Venu Sriram

More Telugu News